Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడ్డ సంఘటన బుధవారం మండలకేంద్రంలోని ముకుందాపురం గ్రామంలో గల సోమేశ్వర బిన్నీ మోడరన్ రైస్‌మిల్లులో చోటుచేసుకుంది.ఎస్సై నవీన్‌కుమార్ వివరాలను వెల్లడించారు.ముకుందాపురం గ్రామంలోని సోమేశ్వర బిన్నీ మోడ్రన్ రైస్‌మిల్లు యజమాని అయిన చిమ్మటి వెంకన్న తండ్రి శ్రీరాములు, మిర్యాలగూడెం మండలం ముల్కలకాలువ గ్రామానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్‌తో కలిసి ప్రభుత్వ పంపిణీ చేసిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సోమేశ్వర బిన్నీ మోడరన్ రైస్ మిల్లుకు తరలించి వాటిని పాలిష్ వేసి అమ్ముతుండగా, నేరేడుచెర్ల పోలీసు,సివిల్ సప్లై వారు కలిసి అట్టి మిల్లుపై దాడి చేసి మిల్లులో నిల్వ ఉన్న సుమారు 200 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుంటామని తెలిపారు.ఇందుకు సహకరించిన పోతుగంటి శ్రీనివాస్ బండి అశోక్ లేలాండ్ డ్రైవర్ మచ్చ రవిపై, మిల్లు డ్రైవర్ మధుపై, మిల్లు గుమస్తా సిరికొండ గోపయ్యలపై కేసు నమోదు చేశారు.ఈదాడిలో రూ.2లక్షల విలువ ఉంటుంది.పోలీసులు బియ్యంతో పాటు అశోక్‌లేలాండ్ దోస్త్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.