Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -నల్గొండకలెక్టరేట్
హరిత హారం కార్యక్రమానికి క్షేత్రస్థాయి అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నుండి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కషి చేయాలని కోరారు. హరితహారం కార్యక్రమ సంపూర్ణ బాధ్యతలను గ్రామ పంచాయతీ, మండలస్థాయి అధికారుల పర్యవేక్షణలో జరగాలని తెలిపారు. అన్ని గ్రామ పంచాయితీ పరిధిలో వైకుంఠధామాలు, ప్రభుత్వ పాఠశాలలు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ స్థలాలలో హరిత హారం మొక్కలు నాటడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీశాఖ, నీటిపారుదల శాఖ పరిధిలోని భూములలో సైతం హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి సిద్దం చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయని దగ్గర పూర్తి చేయాలని తెలిపారు. పూర్తైన ప్రదేశాలలో ఒక సారి పరిశీలించి గ్యాప్స్ లేకుండా మొక్కలను నాటడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీలవారీగా యాక్షన్ ప్లాన్ ప్రకారం అన్ని శాఖల సమన్వయంతో లక్ష్యాన్ని సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ వీడియో కాన్పరెన్సులో జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి విష్ణువర్థన్, డీఆర్డీఓ కాళిందిని, తదితరులు పాల్గొన్నారు.