Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి రూరల్
ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది కానీ రేషన్ డీలర్లకు ఈపాస్ 2 జీ మిషన్లతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం గ్రహించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రేషన్ డీలర్ల కోసం మరో ముందడుగు వేసి డీలర్లకు 4 జీ నెట్వర్క్ ఈపాస్ మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా భువనగిరి మండలం, బోనగిరి టౌన్ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు గంగాదేవి మహేష్ ఆధ్వర్యంలో నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లై గోదాంలో డిటిసిఎస్ ఉపేందర్ , ఈపాస్ మిషన్లు మేనేజర్ వీరేంద్ర , సుధాకర్ , ఆంజనేయులు వారి సిబ్బంది చేత నేడు భువనగిరి రూరల్ ఏరియాలో గల 36 రేషన్ షాపులకు ఈపాస్ మిషన్లు , బోనగిరి టౌన్ లో 17 ఈపాస్ మిషన్లు రేషన్ డీలర్లకు అందజేశారు. వారు మాట్లాడుతూ ఈ ఈపాస్ మిషన్లు సుమారు నాలుగు గంటలపాటు ఛార్జింగ్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్ వై ఫై ద్వారా కనెక్షన్ చేసుకొవచ్చన్నారు. అలాగే ఆంటీనా ద్వారా కూడా బియ్యం తూకం వేసుకోవచ్చు అన్నారు. ఇదివరకు 2 జీ ఈపాస్ మిషన్ మీద 50 నుండి 60 కేజీల బియ్యం తూకం వేసేది కానీ ఇప్పుడు 4 జీ ఈపాస్ మిషన్ మీద 100 కేజీల బియ్యం తూకం వేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ జిల్లా సంఘం అధ్యక్షులు ఎలుగల రాజయ్య , జిల్లా కోశాధికారి దర్శన్ , భువనగిరి మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు గంగాదేవి మహేష్ , మండల ఉపాధ్యక్షులు సిహెచ్ మల్లేష్ , మండల కార్యదర్శి కురాకుల శ్రీనివాస్ , మండల కోశాధికారి రమేష్ , ప్రచార కార్యదర్శి నోముల ఆంజనేయులు , కార్యవర్గ సభ్యులు మంజుల , శ్రీలత , కోనూరు ఉమా , యుగేందర్ , రమేష్ , కృష్ణ , శ్రీనివాస్ , నారాయణ రెడ్డి మరి కొంతమంది రేషన్ డీలర్లు పాల్గొన్నారు.