Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో పునర్ నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న విగ్రహాల ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజస్తంభ ప్రతిష్టాపనను భక్తులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శ్రీమాన్ కారంపూడి నర్సింహాచార్యులు, శ్రీమాన్ అరుణకుమారాచార్యుల ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం, శాంతి కల్యాణం, మహాదాశీర్వాదం కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పాల్గొనగా ఆలయనిర్మాణ దాత ఎగమాటి రాంరెడ్డి, అరుణ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి ఆలయ అభివద్ధికి ఎమ్మెల్యే రూ.లక్షా 1116 విరాళం అందజేశారు. అనంతరం కేశిరెడ్డి మాధురిచంద్రశేఖర్ రెడ్డి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకష్ణారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.