Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
భూదాన్ పోచంపల్లి సర్వేనెంబర్ 620లో తరతరాలుగా గొర్రెల పాక వేసుకొని జీవనం కొనసాగిస్తున్న గొర్రెల మేకల పెంపకం దారులకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ప్రభుత్వ నిధులతో సామూహిక పక్కా గొర్రెల షెడ్లు నిర్మించి ఇవ్వాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజుకోరారు.జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహాశీల్దార్ వీరాబాయి ,ఆర్ఐ గుత్తా వెంకటరెడ్డిలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ి గొర్రెల కాపరులకు భూమి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ,తాగునీటి అవసరాల కోసం బోరుబావులు తవ్వించి నీటి తొట్టెలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కార్యదర్శులు సత్యనారాయణ సత్యనారాయణ కొండ శ్రీశైలం జిల్లా కమిటీ సభ్యులు గంగాదేవి జంగయ్య,స్థానిక సొసైటీ అధ్యక్షుడు గొరిగ నర్సింహ్మ,గొర్రెల కాపరులు తంగెల్ల బుచ్చయ్య,తంగెల్ల చంద్రయ్య,మైల ముత్యాలు,బాతుక లింగయ్య, కొమురయ్య,అయిలయ్య,బీరప్ప, నరేష్,మల్లేష్ పాల్గొన్నారు.