Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిస్నర్ అజయ్ కుమార్
నవతెలంగాణ-నాగార్జునసాగర్
హిల్ కాలనీ కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో పనిచేసే వైద్యులు మరియు సిబ్బంది సమయపాలన పాటించాలని,సమయపాలన పాటించని సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిస్నర్ అజయ్ కుమార్ హెచ్చరించారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమల నెహ్రూ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం మాట్లాడుతూ..ప్రభుత్వ దవాఖానకు వచ్చే బాధితులకు బాధ్యతగా వైద్య సేవలు అందించి, రోగులకు భరోసా కల్పించాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఓపీ సేవలను మరింత పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు.కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు 75శాతం, సెజీరియన్లు 25 శాతం జరుగుతున్నాయని, 100 శాతం సాధారణ కాన్పులు జరిగేలా చూడాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అంతకుముందు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అన్ని వార్డులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.అనంతరం స్థానిక విజయవిహార్ కాన్ఫరెన్స్ హల్ల్లో జిల్లా వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డి సి హెచ్ ఎస్ డాక్టర్ మాత నాయక్,సూపరింటెండెంట్ భాను ప్రసాద్ నాయక్,డాక్టర్ అమత్ నాయక్, డాక్టర్ రామకష్ణ,డాక్టర్ విజయ, నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ కర్ణ అనూష శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్. కౌన్సిలర్ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.