Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నవతెలంగాణ -నల్గొండకలెక్టరేట్
పాత ఈపాస్ మిషన్ గడువు ముగిసినందున జూలై 1వ తేదీ నుండి నూతన ఈపాస్ మిషన్ల ద్వారా మాత్రమే బియ్యం పంపిణీ చేయాలని రేషన్ డీలర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కొత్త ఈపాస్ మిషన్ గురించి నల్లగొండ డివిజన్లలోని రేషన్ డీలర్లకు కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రేషన్ డీలర్లు పారదర్శకంగా పని చేస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. షాపులను సమయానికి అనుగుణంగా తెరిచి ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై ఎం నాగేశ్వరరావు, ఏ ఎస్ ఓ నిత్యానందం, నల్గొండ డివిజన్ రేషన్ డీలర్లు, రెవెన్యూ , సివిల్ సప్లై,సిబ్బంది పాల్గొన్నారు.