Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి గైర్హాజరు
- వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య అధ్యక్షతన సమావేశం
- గామ పంచాయతీలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వాలని పల్లకార్డులతో సర్పంచుల నిరసన
- సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఎంపీటీసీల తీర్మానం,బలపరిచిన జడ్పీటీసీ
- ఏడాది నుండి వాయిదాలు వేస్తుండడంపై సర్పంచ్ ల ఆగ్రహం
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు బహిష్కరించారు. ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి సమావేశ తేదీని ప్రకటించి,ఏజెండా కాఫీలను సభ్యులకు అందజేసి గైర్హాజరు కావడం పట్ల ఎంపీటీసీలు,సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య అధ్యక్షతన సమావేశం మొదలైంది.మండలంలోని సర్పంచ్ లు తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ప్లే కార్డులతో బైఠాయించారు. వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడు ప్రతి గ్రామపంచాయతీకి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హెచ్ఎండిఏ నుండి రావాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. సర్పంచ్ ల ఆందోళనకు జడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి మద్దతు ప్రకటించి నినదించారు. పెన్షన్లు,రైతులకు రుణమాఫీ,రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఎం ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేష్ ఎంపిడిఓ కు వినతిపత్రం అందజేశారు.అనంతరం సమావేశ ప్రారంభంలో పంతంగి సర్పంచ్‌ను మాట్లాడాలని తాత్కాలిక అధ్యక్షుడు ఉప్పు భద్రయ్య కోరారు. సర్పంచ్ సత్యం మాట్లాడుతూ పల్లె ప్రగతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లను వేధిస్తున్నారని గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదని ఆరోపించారు. రాజకీయ కక్షలతో చౌటుప్పల్ మండలానికి హెచ్ఎండీఏ నిధులు ఇవ్వడం లేదని అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే చౌటుప్పల్‌కు రావాల్సిన నిధులను తన నియోజకవర్గానికి మళ్లిస్తున్నారని తెలిపారు. టీిఆర్‌ఎస్ నాయకులు రాజకీయ వైరుధ్యాలతో గ్రామాలభివద్ధి కుంటుపడుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు పంచాయతీల కరెంట్ బిల్లులకే సరిపోతున్నాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధులను నేరుగా పంచాయతీ ఖాతాలకు ఇవ్వాలని కోరారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి ఆదర్శంగా ఉండాల్సింది పోయి భూ కబ్జాలకు పాల్పడడం దారుణమని అన్నారు.తూప్రాన్ పేట బాధిత రైతులు మండల పరిషత్ కార్యాలయానికి వస్తారనే గైర్హాజరు అయ్యారా అని ప్రశ్నించారు. ఎంపీపీ తీరు మార్చుకోకపోతే ప్రజాప్రతినిధుల అందరికి చెడ్డ పేరు వస్తదని అన్నారు.ఇక ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తీర్మానం ప్రవేశ పెట్టగా,జడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి బలపర్చినట్లు తెలిపారు.సీపీఎం, కాంగ్రెస్ ఎంపిటిసిలు, జడ్పీటీసీ సమావేశాన్ని బహిష్కరించి సమావేశ హల్ నుండి వెళ్లిపోయారు.
ఏడాది నుండి సమావేశం పూర్తి స్థాయిలో జరగడంలేదు : సర్పంచులు
చౌటుప్పల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఏడాది నుండి పూర్తి స్థాయిలో జరప డకుండా వాయిదాలు,బహిష్కరణలు చేస్తున్నారని సర్పంచ్ లు ఆరోపించారు. ఎంపీపీ గైర్హాజరు అయ్యిన కూడా వైస్ ఎంపీపీ సమావేశాన్ని ప్రారంభిం చారు.ఆయా శాఖలపై చర్చ జరగాల్సి ఉండే కానీ బహిష్కరించండం ఏమిటని ప్రశ్నించారు. ఆరు నెలల కిందటధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే వరకు సమావేశం చేయొద్దని బహిష్కరించారు. అప్పటి నుండి నేటి వరకు సమావేశం నిర్వహించలేదు.గురువారం అయిన సమావేశం నిర్వహించి మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరుగుతుందని అనుకుంటే మళ్ళీ బహిష్కరించి వాయిదా వేయడం ఎంతవరకు సబబు అని అంటున్నారు. ఎంపీపీ తీరు వల్లే ఇలా జరుగు తుందని కొంతమంది సర్పంచులు విస్మయం వ్యక్తం చేశారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. మండలంలో పరిశ్రమల కాలుష్యం అధిమమైంది. ఇలాంటి సమస్యలను కనీసం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.ఈ సమావేశంలో మండల ఇంచార్జి ఎంపిడిఓ యాదగిరి, ఎంపిటిసిలు చెన్నబోయిన వెంకటేష్,తడక పారిజాత, బద్దం కొండల్ రెడ్డి,రాజమ్మ,జెల్లా ఈశ్వరమ్మ,కో ఆప్షన్ సభ్యులు మాదార్,సర్పంచ్‌లు బాతరాజు సత్యం,బూర్గు చంద్రకళ, ఆకుల సునీత,బచ్చ రామకష్ణ, కాయితి రమేష్,సుమిత్ర, సైదులు,రేణుక పాల్గొన్నారు.