Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం తో దళితులకు ఆర్థిక చేయూత లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక 13 వ వార్డు లో దళితబంధు పధకము లో భాగంగా లబ్దిదారుడు ఏర్పాటు చేసిన గణేష్ స్టీల్ అండ్ సిమెంట్ షాపును ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఈ పథకం అమలుతో దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని పేర్కొన్నారు. ఈ పథకం కుటుంబానికి భరోసా కలిపిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మెన్‌్ వట్టే జానయ్య యాదవ్, 13 వ వార్డు కౌన్సీలర్ వట్టే రేణుక, ఎంపీటీసీి బిరవోలు రవీందర్ రెడ్డి,జడ్పిటిసి జీడీ బిక్షం,.వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు, మండల అధ్యక్షులు వంగాల శ్రీనివాస్ రెడ్డి,సంతోష్ రెడ్డి,13 వ వ వార్డు అధ్యక్షులు షేక్ రఫీ,సర్పంచ్ లు, మహిళలు పాల్గొన్నారు.