Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎస్సీ బాలికల వసతి గృహంలో పనిచేస్తున్న వర్కర్ విజయను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రెమిడాల పరశురాములు మాట్లాడుతూ ఎస్సీ బాలికల వసతి గృహంలో వర్కర్ విజయ ప్రతిరోజు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తుందన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను నాకు ఇవ్వాలంటూ ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు నాగు నాయక్ ,ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కుర్ర సైదానాయక్ , జగన్ వీరన్న తరుణ్ అబి ఉపేందర్ ,నాయకులు కొడిరెక్క మల్లయ్య దేవయ్య, పాపరావు ,వెంకటయ్య , యేసు రత్నం, తదితరులు పాల్గొన్నారు.