Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతకు భవిష్యత్ ఇచ్చింది కేసీఆరే
- విద్యార్థులు ఉద్యోగ రూపంలో సమాజాన్ని బాగుచేయాలి
- రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
విద్యార్థులకు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీటీసీలో పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో నిరుద్యోగులకు భవిష్యత్తు నిచ్చింది కేసీఆరే అని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గం ఎంచుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో లక్ష ఉద్యోగాలు వస్తే 75 శాతం ఆంధ్రాకు కేటాయించి 25శాతం మాత్రమే తెలంగాణకు కేటాయించే వారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగానే95 శాతం ఉద్యోగాలు తెలంగాణకే చెందుతాయన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. యువత ఉద్యమ స్వపంలొ సమాజానికి పని చేయాలని పిలుపు నిచ్చారు. ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18 వేల పోలీసు ఉద్యోగ ప్రకటన చేయడంతో ఎస్,పీసీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లా పోలీసు శాఖ అధ్వర్యంలో ఉచిత శిక్షణా కొరకు అభ్యర్థులకు మేకల అభినవ స్టేడియం నందు దేహ దారుఢ్యం పరీక్షలు నిర్వహించగా 2500 మంది పాల్గొన్నారని తెలిపారు. పురుష అభ్యర్థులకు 800 మీటర్లు, మహిళా అభ్యర్ధులకు 100 మీటర్ల పరుగపందెం నిర్వహించగా 1557 మంది ఎంపిక చేసినట్టు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలో ఎంపిక అయిన అభ్యర్ధులకు పట్టణంలోని ఎన్జీ కళాశాల నందు రాత పరీక్ష నిర్వహించి దీనిలో మొత్తం 500 మందిని ఎంపిక చేసినట్టు తెలిపారు. అదే విధంగా ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ఎస్సీ మహిళా అభ్యర్థులను 233 మంది, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 69 మంది మరియు మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి 7 మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలిపారు . అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ,ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్‌్ మందడి సైదిరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రాజ్ కుమార్, కౌన్సిలర్ పున్న గణేష్, సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
సహాయ చర్యలు చేపడతాం
సాయికిరణ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
అమెరికాలో నల్లజాతీయుల చేతిలో హతమైన సాయి చరణ్ సంఘటనపై ప్రభుత్వ దష్టికి తీసుకెళ్లి సహాయ చర్యలు చేపడతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అమెరికాలోని మేరీల్యాండ్ లో నల్లజాతీయుల చేతిలో హత్యా గావించబడిన నల్లగొండ కు చెందిన నక్క సాయి చరణ్ కుటుంబాన్ని గురువారం సాయంత్రం నల్గొండలోని వివేకానంద నగర్లో పరామమర్శించారు. సాయి చరణ్ మతికి సంబంధించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. సాయి చరణ్ అమెరికాలో దుశ్చర్యలకు బలికావటం బాధాకరమన్నారు. మతుని కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి వెంట నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి,టీఆర్ఎస్ నాయకులు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.