Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చివ్వెంల
మండలంలోని బండ మీది చందుపట్ల గ్రామంలో ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారిపైజరిగిన రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మటిపెళ్లి సైదులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చందుపట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులు ముగించుకొని ట్రాక్టర్లో తిరిగి వస్తుండగా కంటైనర్ ఢకొీనడంతో ప్రమాదం జరిగిందని,ఈ ప్రమాదంలోచందుపట్ల గ్రామానికి చెందిన కేలు రమేష్ మతి చెందారని వారికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు వారి వెంట వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లూరి బాబు ,బచ్చల కూర రామ్ చరణ్, నాయకులు తందర పల్లి నాగయ్య ఉన్నారు.