Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -నకిరేకల్
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని నిమ్మ మార్కెట్ యార్డులో నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. నాటి పథకాల వల్ల నేడు తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారత దేశాన్ని మరో గుజరాత్ లాగా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో కార్పొరేట్ వ్యవస్థకు పట్టం కట్టారని పేర్కొన్నారు. నల్లధనం పెరిగిపోయిందని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతిప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నేటి వరకూ నిరంతరం నియోజకవర్గ అభివద్ధి కోసం కషి చేస్తున్నా మ న్నారు. పట్టణంలోని మెయిన్ రోడ్డు విస్తరణకు రూ. 26 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఐటి పాముల లిఫ్ట్ ద్వారా నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గం లోని 8 గ్రామాలకు ప్రయోజనం చేకూర నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్మల్ చైర్మన్ గంగుల కష్ణారెడ్డి, డి సి సి బి వైస్ చైర్మన్ రెడ్డి దయాకర్ రెడ్డి, నకిరేకల్ మునిసిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీలు ధనలక్ష్మి నగేష్ గౌడ్, తరాల బలరాం తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికి కషి
మార్కెట్ కమిటీ నూతన చైర్మెన్ ప్రదీప్ రెడ్డి
రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మెన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనపై ఎంతో నమ్మకం ఉంచి మార్కెట్ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించినందుకు హర్షం వ్యక్తం చేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు లో ఎలాంటి అవాంతరాలు లేకుండా స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి సహకారంతో రైతులకు అండగా ఉంటానన్నారు.