Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ- దేవరకొండ
దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ...వార్డులలో మంచి నీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. పట్టణంలో పారిశుధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రతి నెలా మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహా, వైస్ చైర్మెన్ రహత్ అలీ,కమిషనర్ వెంకటయ్య,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్,మాజీ మున్సిపల్ చైర్మన్ వాడిత్య దేవేందర్,కౌన్సిలర్లు తస్కిన్ సుల్తానా,మహమ్మద్ రైస్,మూడవత్ జయప్రకాష్ నారాయణ,పొన్నబోయిన భూదేవిసైదులు,చిత్రం శ్రీవాణిప్రదీప్,పలేపు మల్లీశ్వరిఅశోక్,తదితరులు పాల్గొన్నారు.