Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా
- సర్వసభ్య సమావేశం హాల్లోకి దూసుకెళ్లినసీపీఐ(ఎం)నాయకులు
-మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
రాష్ట్రంలో 57ఏండ్లు నిండిన ప్రతి వారికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్ చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించి వారితో బైఠాయించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభానికి ముందే గేటు ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా జడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూమ్ లో ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా నిర్వహించలేదని అన్నారు. అనంతరం సభ్య సమావేశం ప్రారంభం అవ్వగానే సీపీఎం నాయకులు కార్యకర్తలు నినాదాలు చేస్తూ సమావేశం హాల్లోకి వెళ్లారు. రైతులకు ప్రకటించిన రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేసిన తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. వీరి ఆందోళనల మధ్యనే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఎంపీటీసీలు జడ్పీటీసీ స్పష్టం చేసిబయటికి వచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మండల కమిటీ సభ్యులు బోయ యాదయ్య, ఆదిమూలం నందీశ్వర్, కొండే శ్రీశైలం, ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం, తడక పారిజాత, సర్పంచ్ బూరుగు చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ఉప్పు భద్రయ్య, బద్దం కొండల్ రెడ్డి, ఈశ్వరమ్మ, రాజమ్మలు పాల్గొన్నారు.