Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు 15,600 ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండం పల్లి సత్తయ్య కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను కలిసి వినతి పత్రం అంద జేసీ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్లు తదితర శానిటేషన్ సిబ్బంది కి వేతనాలు పెంచాలని అనేక రూపాలలో ఆందోళన చేసినట్టు తెలిపారు. కార్మికుల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం స్థానికంగా టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్ లను ఎంపిక చేసి కనీస వేతనం 15600, పీఎఫ్, ఈఎస్ఐ ఇతర సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అందుకనుగుణంగా నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ నేటికీ కాంట్రాక్టర్ ఎంపిక, నూతన వేతనాలు అమలు జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నల్లగొండ అధ్యక్షులు మునగ వెంకన్న ,కార్యదర్శి చిన్నబోస్క నరేష్, కోశాధికారి మారం నాగమణి, ఉపాధ్యక్షులు పర్వతం రామయ్య, వల్కి లలిత, సహాయ కార్యదర్శి పందుల అండాలు, సభ్యులు నాగయ్య, కష్ణయ్య, జ్యోతి,తదితరులు పాల్గొన్నారు.