Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయాధికారి సుచరిత
నవతెలంగాణ- నార్కట్పల్లి
ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియాతో రైతులకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి సుచరిత పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఆవశ్యకత గురించి రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడుతూ భూమిలో ఉన్న పాస్పరస్ నిలువలు భూమికి ఉపయోగపడే విధంగా బ్యాక్టీరియా పని చేస్తుందని చెప్పారు. దీంతో రైతులు డీఏపీ ఉపయోగాన్ని తగ్గించాలన్నారు. మండలానికి వచ్చినటువంటి కంది మినీకిట్స్ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోమండల వ్యవసాయాధికారి గిరిప్రసాద్ విస్తరణ అధికారులు లియాఖత్ అలీ, విష్ణువర్ధన్ రెడ్డి, అమూల్య, శిరీష పాల్గొన్నారు.