Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవ తెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ లోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తాను గహ నిర్మాణ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు సుమారు రూ. 300కోట్లు కేటాయించి రామస్వామి గట్టు వద్ద 2,300 ల ఇండ్ల నిర్మాణం కు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణములుకు శ్రీకారం చుట్టానని తెలిపారు. 80 శాతం పనులు పూర్తి చేసేనాటికి 3 నెలల ముందు ప్రభుత్వం రద్దు అయి ఇండ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయన్నారు. హామీ అమలు కాకపోగా మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణాలను ఇప్పుడు డంపింగ్ యార్డు గా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వం స్థలాలను అధికార పార్టీ నాయకులు కబ్జా లు చేస్తున్నారని వారి పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఒక్క ప్రభుత్వం భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలే దన్నారు. అధికారులు నిశబ్దం పాత్ర పోషిస్తుండడంతో రోజురోజుకు కబ్జాల పర్వం పెరిగి పోతున్నాయన్నారు.పెదవీడు రెవెన్యూ పరిధిలో గుర్రం బోడు పోయే దారిలో ఉన్న 46 ఎకరాల భూమిని కబ్జా చేశారని దాని విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందని కలెక్టర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు లేవన్నారు. హుజూర్ నగర్టౌన్లో గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ కి వచ్చిన లే అవుట్ భూముల రికార్డులు మాయం అవుతున్నప్పటికీ చర్యలు లేవన్నారు.సాయిబాబా టాకీస్ రోడ్డు లో ఉన్న మున్సిపాలిటీ లే అవుట్ స్థలంరూ. 25 కోట్ల విలువైన 5,500 గజాలు ,పద్మశాలి కల్యాణ మండపం పక్కన మున్సిపాలిటీ లే అవుట్ స్థలం, వీ. పి. ఆర్ వెంచర్లో ఉన్న 2000 గజాల స్థలం ను కబ్జా చేశారని తెలిపారు. అంతేగాక మున్సిపాల్టీ లో ఏ. ఈ,అర్. ఐ ల లాగిన్ పాస్వర్డ్ లను దొంగిలించారని స్వయంగా కమీషనర్ చెప్పిన నేటి వరకు చర్యలు శూన్యమన్నారు . నియోజకవర్గంలో ప్రభుత్వం ,ప్రైవేటు భూముల్ని కబ్జా చేయడానికి ఒక దొంగ ల ముఠా బయలు దేరిందని అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతకుముందు పట్టణ పరిధిలోని మోడల్ కాలనీ అఖిలపక్ష నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ రావు, సిపిఎం, సిపిఐ పట్టణ కార్యదర్శులు నాగారపు పాండు, గుండు వెంకటేశ్వర్లు ,వైఎస్ఆర్ టిపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, నాయకులునాగన్న గౌడ్, సాముల శివారెడ్డి ,ఎల్లావుల రాములు, మేకల నాగేశ్వరరావు, అరుణ్ కుమార్ దేశముఖ్, మంజు నాయక్, మోతిలాల్, గోపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.