Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెన్షన్, రేషన్ కార్డులు ఇవ్వలేకపోతున్నామని
- సర్పంచుల ఆవేదన
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ అధ్యక్షతన శుక్రవారం ఎంపీడీవో సమావేశమందిరంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. ఎలిమినేటి ఎమ్మెల్సీ కష్ణారెడ్డి హాజరై, మాట్లాడారు. ఎంపీటీసీిల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన మాట్లాడుతూ గ్రామాలలో హెల్త్ సబ్ సెంటర్లలో అన్ని రకాల మందులు పంపిణీ చేయాలని కోరారు. తొక్కా పురం ఎంఈపటీసీ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ కరోనా మూడవ డోస్ ఎప్పుడు పంపిణీ చేస్తారని, ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరాలు అడిగారు. అనం తారం సర్పంచ్ మల్లికార్జున్ మాట్లాడుతూ గతంలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ ఇల్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చిందని, కనీసం వాటికి ధ్రువీకరణ పత్రం ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొంతమందికి ధ్రువీకరణ పత్రాలు గతంలో ఇచ్చారని, ప్రస్తుతం ఎందుకు ఇవ్వడం లేదని సభలో అధికారులను నిలదీశారు. వడపర్తి సర్పంచ్ కష్ణారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికై మూడేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు గ్రామంలో ఒక రేషన్ కార్డు, ఒక్క పెన్షన్ మంజూరు చేయలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అక్రమ లేఅవుట్లు ఉన్నాయని, వాటి పై అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదని సభలో నిలదీశారు. గతంలో పల్లె ప్రగతి లో చేసిన పనులకు,ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదని, మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల కలెక్షన్ అని చెప్పి ఒక్కొక్క గ్రామంలో 50 శాతం 60 శాతం మాత్రమే పూర్తిచేసి, గ్రామపంచాయతీ నాల్లాలకే మళ్లీ కనెక్షన్ ఇచ్చారన్నారు. నెలకు గ్రామ పంచాయతీకి లక్షా 40 వేల రూపాయల ఆదాయం ఉంటే, అందులో కరెంటు బిల్లు 40,000, జీతాలు పోను , ట్రాక్టర్ డీజిల్ కు ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లేని కరెంటు బిల్లులను ప్రస్తుతం గ్రామ పంచాయతీల పై భారం మోపిందని, కనీసం గ్రామ పంచాయతీ వర్కర్లకు ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 692 పెన్షన్ కోసం దరఖాస్తు చేసినట్లు, త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. రేషన్ కార్డులపై తహసీల్దార్ మాట్లాడుతూ 517 రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నట్లు వారికి ప్రభుత్వ అనుమతి రాగానే రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. కునూరు ఎంపీటీసీ పాశం శివానంద్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడే సందర్భంలో డీలర్ షిప్ ఎరువులు విత్తనాలు సప్లై చేయడానికి ఉత్సాహవంతులైన వారు శిక్షణ తీసుకోవడానికి ఉన్న దేవి ప్రోగ్రాం వివరాలు తెలుపక పోవడని నిలదీశారు. ఎంపీటీసీ సుజాత మాట్లాడుతూ కే కే తండాలో మిషన్ భగీరత నీళ్లు రావడం లేదని, ఈ విషయం గత సంవత్సరం నుంచి పెడుతున్న అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్ స్పందిస్తూ వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి వివరాలు తెలియ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, ఎంపీటీసీలు సామల వెంకటేష్, కొండల్ రెడ్డి, సర్పంచులు తంగళ్ళపల్లి కల్పన, పడాల అనిత, మురళి కష్ణ వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, 12 శాఖల అధికారులు పాల్గొన్నారు.