Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి
- కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం
- శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
నల్ల జాతి చేతుల్లో సాయి చరణ్ మరణం బాధాకరమని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి అమెరికాలో దుండగుల కాల్పులలో మరణించిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శుక్రవారం నల్గొండ పట్టణంలోని వివేకానంద నగర్ కాలనీలోని వారి నివాసంలో పరామర్శించి మాట్లాడారు. మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు నక్క సాయి చరణ్ మరణించడం చాలా బాధాకరమని అన్నారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా అమెరికా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని గుత్తా సుఖేందర్ రెడ్డి హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బాగొని రమేష్,మాజీ మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కష్ణ రెడ్డి,స్థానిక కౌన్సిలర్ బండారు ప్రసాద్,అడ్వకేట్ ఠాగూర్,ఇంద్రసేన రెడ్డి,హరికష్ణ, తదితరులు పాల్గొన్నారు.