Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మీ
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జులై4న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మీ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మిర్యాలగూడ బంగారు గుడ్డులో ఐద్వా నాయకులతో కలిసి సంతకాల సేకరణ చేపట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలల పాటు ఐద్వా నిర్వహించిన సర్వేలో వెలుగులోకి వచ్చిన సమస్యలు రేషన్ కార్డు,ఫించన్లు,డబుల్ బెడ్రూం ఇళ్ళు,రోడ్లు,డ్రైనేజీ,మంచినీటి సమస్యలు పరిష్కరించాలని మండల, జిల్లా స్థాయిలో ఉద్యమాలు నిర్వహించి వినతిపత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు జానమ్మ,కృష్ణవేణి, సరిత, మంగమ్మ, ఎల్లమ్మ, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.