Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హమాలీ కార్మికుల ఉపాధిని కాపాడాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ విభేదాల కారణంగా రైస్ మిల్లులు మూతపడి హమాలీ కార్మికుల ఉపాధి పోయిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా హమాలీ కార్మికులు ఆందోళన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జూన్ 7 నుండి ఎఫ్సీిఐ సీఎంఆర్ బియ్యం సేకరణ నిలిపివేయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 150 మిల్లులు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రైస్ మిల్లులో పనిచేసే హమాలి కార్మికులకు, మిల్లు డ్రైవర్లు, స్వీపర్లు, గుమస్తాలతో పాటు ఎస్ డబ్ల్యూ సి, సీడబ్ల్యూసీ గోదాముల్లో ఎగుమతి దిగుమతి చేసే హమాలీలకు పని లేకుండా పోయిందని చెప్పారు. రైస్ మిల్లు మూతపడడంతో వలస వచ్చిన ఇతర రాష్ట్రాల కార్మికులకు పని లేకపోవడంతో సొంత ప్రాంతాలకు వెళ్లిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. హమాలీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడంతో పాటు రైస్ మిల్లర్లు కూడా విద్యుత్ బిల్లులు, బ్యాంకు ఈఎంఐలు, తదితర బారాలు పడి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. వీరే కాకుండా వీరిపై ఆధార్ పడ్డ వారు కూడా ఉపాధి పోతుందని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ విభేదాల కారణంగా సివిల్ సప్లై, ఎఫ్‌సీఐ అధికారుల సమన్వయ లోపం జరుగుతుందని, అధికారులు జోక్యం చేసుకొని సీఎం ఆర్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ సేకరణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బియ్యం సేకరించక పోతే ప్రజలను, హమాలీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.