Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య
నవతెలంగాణ- రామన్నపేట
చేనేత సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బడుగు శంకరయ్య ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత సహకార సంఘం ఆవరణలో కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివద్ధి కోసం పథకాలు ప్రకటించినప్పటికీ 40 శాతం సబ్సిడీ కార్మికులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం మూలంగా చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రకటించిన పథకాలు ఇప్పటికీ ఎక్కడ అమలు జరగడం లేదని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో కరోనా ప్రభావం తో చేనేత మార్కెట్ దెబ్బతినడం వల్ల ముడి సరుకులు, రంగులు, నూలు, రసాయనాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల పనులు సరిగా నడవలేక పోవటం వల్ల అనేక మంది చేనేత కార్మికుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. అనేక గ్రామాలలో చేనేత సహకార సంఘాలకు పాలకవర్గం లేకపోవడం, సంవత్సరాల తరబడి సహకార సంఘాలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల కార్మికులకు సరిగ్గా పనులు దొరకడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు వనం ఉపేందర్,చేనేత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుర్రం మహేష్, వెల్లంకి చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు అంకం పాండు, చేనేత నాయకులు గంజి రంగయ్య, పున్న కష్ణమూర్తి, పున్న నరేష్, వనం బిక్షపతి, ఈపూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.