Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు మాట్లాడుతూ అగ్నిపథ్ స్కిం వలన దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అదేవిధంగా నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొన్నారు.ఉపాధి భద్రతకు కనీస రక్షణ లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడాలంటూ యువతకు పిలుపునివ్వడం నేరపూరితమైన చర్య అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ముత్యాలు, సంఘం నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు చౌదరి, రామచంద్రం, వరమ్మ, బిక్షపతి, శ్యామల, సునీత, కుమార్, మంజుల, లక్ష్మి, యాదగిరి, నరసింహ, సరూప, లక్ష్మమ్మ, ప్రజా సంఘాల నాయకులు వడ్డెబోయిన వెంకటేశం పాల్గొన్నారు.
చౌటుప్పల్ : త్రివిధ దళాల్లో మోడి ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోడి ప్రభుత్వం రాజీనామా చేయాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం డిమాండ్‌చేశారు. సంఘం ఆలిండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడారు. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి ఆర్మీలో యువత చేరుతుందని, వారికి గతంలో 17 ఏండ్లు ఉద్యోగం చేసే అవకాశం ఉండేదన్నారు. కానీ మోడి ప్రభుత్వం సైన్యంలో కూడా కాంట్రాక్టు పద్ధతి తీసుకొచ్చి నాలుగేండ్లు సైనికుల కోసం తెచ్చిన అగ్నిపథ్ పథకం వల్ల దేశ భద్రతకే ప్రమాదమని, దానిని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం పట్టణ కన్వీనర్ ఎమ్‌డి.పాషా, సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, నాయకులు రాగీరు కిష్టయ్య, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం వెంకటేశం, సత్యం, వెంకటేశం పాల్గొన్నారు.