Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీలర్స్కు ఈ పాస్ మిషన్లు అందుచేత
- అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు
నవతెలంగాణ- సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో చౌక దుకాణాల ద్వారా డీలర్లు వినియోగదారులకు విజన్ టెక్ ఈ పాస్ ల ద్వారా మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజన్ టెక్ ఈ పాస్ విధానపై ఏర్పాటు చేసిన శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన విజన్ టెక్ ఈ పాస్ విధానం పై జిల్లాలో రేషన్ డీలర్లు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని వినియోగదారుల ఇకపై మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ డివిజన్ల వారీగా రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ పాస్ మిషన్ లను డీలర్లకు అందచేశారు. ఈ కార్యక్రమంలో డీఎం రాంపతి, ఏఎస్ఓ పుల్లయ్య, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.