Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి హద్దు లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఎస్ఎఫ్ఐ మండలకమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షులు బర్రె రాజుపెరియర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల కమీషన్లకు పరిమితమై రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కనుమరుగు చేస్తుందని విమర్శించారు. ప్రయివేట్ విద్యాసంస్థల్లో యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అమ్మవద్దనే కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం మున్సిపల్ కార్యదర్శి మనోజ్‌కుమార్, దాసరి ప్రకాశ్, ధనుంజయ ఉన్నారు.