Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న నల్గొండ ఐబీసీఈ ఆఫీస్ ఎదుట ధర్నా
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ -తిరుమలగిరిసాగర్
సాగర్ ఎడమ కాలువ పైన ఉన్న లిఫ్ట్‌లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే నిర్వహించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం మండలంలోని అల్వాల గ్రామంలో ఎడమ కాలు పై ఉన్న ఆర్ వన్ లిఫ్ట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలవ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆయకట్టుకు ఎక్కువ నీరు అందించకపోవడం వల్లఆ నష్టాన్ని పూరించేందుకు ఎడమకాలువ పై ఎత్తిపోతుల పథకాల ద్వారా అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కొన్ని లిఫ్టు ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేశారన్నారు. కొంతకాలం తర్వాత లిఫ్ట్ మోటార్ల జీవితకాలం అయిపోయి పనిచేయక ఆగిపోవటం కరెంటు సప్లై సరిగా లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి 100 కోట్ల రూపాయలు కేటాయించి కొన్ని మరమ్మతులు చేపట్టారు సాగర్ ప్రాజెక్టులో భాగంగా అన్నిటికీ పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించి ప్రభుత్వమే నడిపిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు వాగ్దానాలు చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు దాని కారణంగా రైతులే స్వయంగా మెయింటెనెన్స్ సిబ్బంది జీతభత్యాలు భరించాల్సి వస్తోందన్నారు. ఇది రైతులపై భారం నడపలేక పోతున్నారని మోటర్లు స్టార్టర్లు మీటర్లు పనిచేయడం లేదని కాలువలు తూములు ఎక్కడికక్కడ దెబ్బతిని ఉన్నాయని వీటి నిర్వహణ ముందు ఐడీసీ తర్వాత ఎన్ఎస్పీి ఇప్పుడు ఎలాంటి టెక్నికల్ అనుభవం లేని ఐబీసీఈ వారికి అప్పజెప్పడం సరైంది కాదని అన్నారు లిఫ్టు మరమ్మత్తుల పనులు చేపట్టాక పోయినా సిబ్బందులు నిర్మించకపోయినా సాగవుతున్న సుమారు 50 వేల ఎకరాల బీడు భూములుగా మారే పరిస్థితి వస్తుందన్నారు. లిఫ్టు సంబంధించిన పనులు ఐడీసీ అనుభవం ఉన్నటువంటి అధికారులతోటి మరమ్మత్తులు చేయించి పూర్తి బాధ్యత ప్రభుత్వమే నిర్వహించే విధంగా ఉండాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఈనెల 27న ఉదయం 10 గంటలకు నల్లగొండ ఐబీసీఈ ఆఫీస్ ఎదుట రైతు సంఘం, ఎత్తిపోతల పథకాల రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి రైతు సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శి కున్ రెడ్డి నాగిరెడ్డి తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్, జటావత్ రవి నాయక్ ,జటావత్ రవీందర్, రైతులు రవీందర్ రెడ్డి,వాడిత్య మోతిలాల్,నెహ్రు,బుజ్య, తదితరులు పాల్గొన్నారు.