Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల్లో రక్తహీనత బాగా పెరుగుతోంది
- యాదాద్రి కలెక్టర్ పమేలాసత్పతి
నవతెలంగాణ-మోత్కూరు
మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండేలా ఆకుటుంబం చూసుకోవాలని యాదాద్రి కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. గర్భిణిలు, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభ కార్యక్రమంలో భాగంగా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో ఐసీడీఎస్ మోత్కూరు ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పమేలాసత్పతి మాట్లాడుతూ మహిళల్లో పోషక లోపాలు ఎక్కువగా ఉన్నాయని, జిల్లాలోని మహిళల్లో రక్తహీనత 70శాతంగా ఉండి రెడ్ జోన్ లో ఉందని, ప్రస్తుతం అది మరో 20శాతం మేర తగ్గిందని తెలిపారు. రక్తహీనతతగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో కషి చేస్తుందని, కుటుంబ సభ్యులు కూడా మహిళల ఆరోగ్యం పట్లజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుటుంబం, సమాజంలో ఉన్న కొన్ని అపోహల కారణంగా మహిళలు గర్భం దాల్చిన వెంటనే అంగన్వాడి కేంద్రంలోగాని, ఆరోగ్య కేంద్రాల్లోని చెప్పకుండా మూడు, నాలుగు వరకు దాచిపెడుతున్నారని, దీంతో ఇటు వారికి ఆరోగ్యంపై సరైన అవగాహన కల్పించేవారు లేక ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, అటు ప్రభుత్వ పథకాలు, సదుపాయాలను కోల్పోవాల్సి వస్తుందని
చెప్పారు. లింగ నిర్ధారణ స్కానింగ్ టెస్టులు చేయించవద్దని హెచ్చరించారు. అనంతరం గర్భిణిలకు కలెక్టర్ సామూహిక సీమంతం చేసి, చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. సీడీపీవో జ్యోత్స్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీడబ్ల్యూవో జిల్లా ఇన్చార్జి ఎం.చంద్రకళ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వై.అలివేలు, మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్ పురుగుల వెంకన్న, మండల ప్రత్యేకాధికారి యాదయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ షేక్ అహ్మద్, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, ఆర్ఐ గాలయ్య, ఐసీడీఎన్ సూపర్వైజర్లుు పాల్గొన్నారు.