Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ -తిరుమలగిరి
ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములో పేదలు వేసుకున్న గుడిసెలకు వెంటనే పట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం), వ్యకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిశాల గ్రామంలోని సర్వే నెంబర్లు 146, 147 లోని 4 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కడతామని 2016లో శాసనసభ్యులు శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పటివరకు ఆ స్థలంలో ఇల్లు నిర్మించలేదన్నాఉ. పేదలు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాలకు ఇండ్ల స్థలాల, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ,సిపిఎం మండల కమిటీ సభ్యులు కడారి లింగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, మండల కార్యదర్శి పడమటింటి నగేష్, ప్రభాకర్, నాయకులు చిత్తలూరి సోమయ్య, అనిల్, పద్మ వెంకటమ్మ, రాములు, మల్లయ్య పాల్గొన్నారు.