Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -నల్గొండకలెక్టరేట్
మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో టి-హబ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య సమావేశ మందిరంలో విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులకు ఫ్లేమ్ ఎంటర్ప్రైమిషప్ ద్వారా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో వి-హబ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.వి-హబ్ పూర్తిగా రాష్ట్ర ఐటీఅండ్సి విభాగం పరిధిలో పని చేస్తుందని తెలిపారు. మహిళల భాగస్వామ్యం ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగమించే దిశగా కషి చేయాలని సూచించారు. వి-హబ్ అనేది ప్రభుత్వ ఏజెన్సీలు, పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలతో కలిసి పని చేస్తుందని తెలిపారు. స్టార్టప్ కంపెనీల స్థాపనకు ముందుకు వచ్చినట్లైతే వి-హబ్ ద్వారా ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తోందని తెలిపారు. వి-హబ్ సాంకేతిక రంగాలపై ఫోకస్ చేసే వినూతన్న ఆలోచనలు, పరిష్కారాలతో ఉన్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించి తను ఎంచుకున్నరంగంలో విజయం సాధించడానికి సాయపడటం జరుగుతుందని వివరించారు. వి-హబ్ (టెక్నాలజీ హబ్) ఈ నెల 28వ తేదీన ప్రారంభానికి రాష్ట్ర ఐటి శాఖ తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. వి.హబ్, టి హబ్ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకుని జిల్లా నుండి ఔత్సహిక పారిశ్రామిక వేత్తలు గా ముందుకు వెళ్లాలని అన్నారు. వి-హబ్ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, గ్రామాల్లో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వి-హబ్ తన తొలి ఫ్లాగ్షిప్ రూరల్ ఇంక్యుబేషన్ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేసినట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా టెక్స్ టైల్స్, హ్యాండ్లూమ్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండిక్రాఫ్ట్స్ వంటి ఐదు ముఖ్యమైన రంగాలలో మహిళా ఎంట్రప్రెన్యూర్లకు ఇంక్యుబేట్ చేస్తోంది. రీజన్లలో సంస్థలను మరింత ప్రోత్సహించేందుకు రూరల్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ పనిచేస్తుందని ఆమె చెప్పారు. వి-హబ్, టి-హబ్ సంయుక్తంగా 10 జిల్లాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్టార్టప్ కంపెనీల గురించి, మహిళలు తమ వ్యాపార రంగంలో ఎలా విజయం సాధించారో షార్టు స్టోరీస్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టి-హబ్ మేనేజర్ ఆయుష్, పరిశ్రమల శాఖ మేనేజర్ భారతి, జిల్లా విద్యా శాఖ అధికారి భిక్షపత్తి, ఎన్ఐసీ ఇన్ఫోమేటిక్ ఆఫీసర్ గణపతిరావు, ఇ-డిస్ట్రిక్ మేనేజర్ గఫూర్ అహ్మద్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవల్లి టౌన్షిప్ వేలం పాటలో పాల్గొనాలి
శ్రీవల్లి టౌన్ షిప్ లో ప్రభుత్వమే అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నందున ఔత్సాహికులు వేలం పాటలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. శుక్రవారంకలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీవల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక గహాల వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరబాద్ రోడ్డులో 12వ పోలీస్ బెటాలియన్ ఎదురుగా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామంలో ఉన్న రాజీవ్ స్వగహ శ్రీవల్లి టౌన్ షిప్ ప్లాట్ లను పాక్షిక నిర్మాణ ఇండ్లకు అన్ని అనుమతులపాటు రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థతోపాటు పార్కులను కూడా డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. వేలంపాటకు మరో రెండు రోజుల గడవు మాత్రమే ఉన్నందున ఆసక్తిగల వారు కలెక్టరేట్ లో నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు. వేలంలో పాల్గన్న ఔత్సాహికులు ఎవరైతే ఎన్ఓసి.కోసం దరఖాస్తు చేసి ఇండ్లను దక్కించుకుంటారో అలాంటి వారికి బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. శ్రీవల్లి టౌన్ షిప్ లో ప్లాట్లతోపాటు పాక్షిక గహాలకు కలిపి ఇప్పటి వరకు 4 కోట్ల 14 లక్షల 5 వేల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రానున్నట్లు తెలిపారు. శ్రీవల్లి రాజీవ్ స్వగహ టౌన్‌షిప్‌కు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రాజెక్టు మేనేజర్ షఫియుద్దీన్ సెల్ నెం.9154339209 నెంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ వేలం పాటలో అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు ఎ.డి. ఎమ్. శ్రీనివాసులు, డి.ఎస్.ఓ. వెంకటేశ్వర్లు, పశుసంవర్థక శాఖ ఎ.డి. డాక్టరు శ్రీనివాస్, రాజీవ్ స్వగహ ప్రాజెక్టు మేనేజర్ షఫీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.