Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జిల్లాలో ప్రముఖుల పర్యటనలు ఉన్నపుడు పాటించాల్సిన నియమ నిబంధనలపై కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.జిల్లాలో ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా ఉంటాయని ఆ సమయాలలో జిల్లా అధికారులు ప్రోటోకాల్ నియమా నిబంధనలు తూచా తప్పక పాటించి ఎక్కడ పొరపాటు జరుగకుండా చూసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.కార్యక్రమం ముందే తెలిసిపోతుంది,కాబట్టి ప్రభుత్వ ప్రోటోకాల్ రూల్స్ ప్రకారం అన్ని ముందే సరి చూసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ , కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి, జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.