Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతలపాలెం :వ్యర్ధ రసాయనాల (సల్పురిక్ యాసిడ్) ట్యాంకర్ పట్టికున్నట్లు ఎస్ఐ కష్ణారెడ్డి శనివారం తెలిపారు.శనివారం తెల్లవారు జమున బుగ్గమాధవరం గ్రామస్తులు వ్యవసాయ పని నిమిత్తం గ్రామ శివారులో గల వ్యవసాయ భూములకు వెళ్తుండగా మార్గమాధ్యలో బండలరేవు వాగు వద్దకు వెళ్ళేసరికి Aూ 01 ఔ 5097 నంబరుగల టాంకర్ నందు, అయినేష్ ఫార్మా కంపెనీ జగ్గయ్యపేట నుండి వ్యర్ధ రసాయనాలను (సల్పురిక్ యాసిడ్) తెచ్చి, అట్టి ట్యాంకర్లో గల వ్యర్ధ రసాయనాలను (సల్పురిక్ యాసిడ్) నీటిలో కలుపుతున్నాడు. డ్రైవర్ను ప్రశ్నించగా తన పేరు పేత్లావత్ జయపాల్ అని, పైన తెలిపిన కంపనీ యొక్క యజమాన్యం ఆదేశాల మేరకు ఈ పని చేయుచున్నానని తెలిపాడు.ఈ రసాయన వ్యర్ధాల వలన మా యొక్క పంటలు సరిగా పండక నష్టపోవడం, కలుషిత నీరు తాగటం వల్ల మాయొక్క పశువులు అనారోగ్య బారినపడి చనిపోవటం జరుగుచున్నదని గ్రామస్తులు చింతలపాలెం పోలీసుస్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు.