Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కొక్కరి నుండి రూ.550 వసూలు
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణ పరిధిలోని తమ్మర గ్రామంలో సిటిజన్ డెవలప్మెంట్ స్వచ్ఛందసంస్థ మహిళలకు 100 రోజులు టైలరింగ్ పని నేర్పించి కుట్టు మిషన్ ఇస్తానని నమ్మబలికి సుమారు గ్రామంలో 150 మంది మహిళల వద్ద 550 రూపాయలు కట్టించుకుని మహిళలను, ఆర్గనైజింగ్ అధికారులను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం తమ్మర గ్రామ మహిళలు గ్రామపంచాయతీ వద్దకు చేరుకొని నిరసన తెలియజేశారు.మండలం మొత్తం సుమారు 2000 మందికి పైగా ఉంటారన్నారు. మహిళలు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలది పద్మావతితో కలిసి ఆర్గనైజింగ్ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలది పద్మావతి మాట్లాడుతూ మాట్లాడుతూ మహిళలను కుట్టుమిషన్లు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కనకయ్య, మహిళలు పాల్గొన్నారు.