Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలగిరి:లింగనిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవని డీఎంహెచ్ఓ కోటాచలం హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, సూర్యాపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి ఆధ్వర్యంలో శనివారం నాడు ఆరోగ్యం సిబ్బందికి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించిన, తెలుసుకొనే వారికి,తెలియపరిచిన వారికి,ప్రోత్సాహించిన వారిపై ూజూచీణు 1994 యాక్ట్ ప్రకారం కఠినచర్యలు ప్రభుత్వ పరంగా తీసుకొనబడుతుందని హెచ్చరించారు.ఆరోగ్య సిబ్బంది సీజన్వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రజలలో పరిసరాల పరిశుభ్ర గురించి అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్లు రామచంద్రు, స్వరూపకుమారి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.