Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
డ్రగ్స్ అనేది దేశ శక్తిని, యువతను నిర్వీర్యం చేస్తుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేఖ దినోత్సవాన్ని పురష్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు.డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకమని, డ్రగ్స్, గంజాయి, కొకైన్ లాంటి మాదక్ణద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు.రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుం దన్నారు.రాష్ట్ర సీఎం, డీజీపీల ఆదేశాలతో పటిష్టమైన నిఘా ఉంచి జిల్లావ్యాప్తంగా అక్రమంగా నిల్వ ఉన్న, రవాణా చేస్తున్న భారీగా గంజాయి సీజ్ చేశామని చెప్పారు. డ్రగ్స్ అనేది సమాజాన్ని నాశనం చేస్తుందని, ఇది సమాజ మనుగడకు, యువత జీవితానికి వినాషణకారి అన్నారు.దీనిని సమాజం నుండి ప్రాలదొలదానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ర్యాలీ సూర్యాపేట టౌన్ కొత్త బస్టాండ్ నుండి శంకర్ విలాస్ సెంటర్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగ భూషణం,సీఐ లు ఆంజనేయులు,ఎస్బీ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు శ్రీనివాస్, క్రాంతి, సైదులు, సురేష్, సాయి, మీడియా ప్రతినిధులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.