Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
ఈనెల 28 నుండి రాష్ట్రంలోని రైతులందరికీ సాగు పెట్టుబడి అయిన రైతు బంధు పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శనివారం మండలంలోని ఎన్నారం గ్రామం లో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీరోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ముగ్గురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.అనంతరం గ్రామ సర్పంచ్ మెట్టు మహేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలోని అన్ని వర్గాలకు దళితబంధు పథకాన్ని దశలవారీగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్నారు.అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్‌వన్‌గా నిలిచారన్నారు. ప్యూరిఫైడ్, మినరల్ వాటర్ కొనుగోలు చేసి తాగొద్దని, వాటి ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు.కష్ణ మంచినీటిని వేడి చేసి వడపోసుకొని తాగాలని ఆయన సూచించారు.గ్రామంలో నూతనంగా నిర్మించనున్న దేవాలయానికి రూ.2.16 లక్షలను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామస్తులు కూడా తమకు తోచినట్లుగా ఆర్థిక సహాయం అందించి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో తహసీిల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, ఎంపీటీసీలు ఏనుగు పుష్పమ్మ, గొరిగే నరసింహ, మాజీ ఎంపీపీ నీల దయాకర్, వివిధ గ్రామాల సర్పంచులు సోమయ్య, గుత్తా నర్సింహారెడ్డి, ఉప్పు ప్రకాష్, పిట్ట కష్ణారెడ్డి, నాయకులు పున్న జగన్మోహన్, మెట్టు శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి పోషబోయిన మల్లేశం, బొక్క పురుషోత్తంరెడ్డి, పోతురాజు సాయికుమార్ పాల్గొన్నారు.