Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
సమగ్ర బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ రజినిరాజశేఖర్ అన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు అంగన్వాడీకేంద్రంలో వాడి కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమగ్ర బాలల పరిరక్షణ పథకం (×జూూ) పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కషి చేయాలన్నారు.ఆత్మన్యూనతాభావాన్ని విడనాడి ఆత్మవిశ్వాసంతో పిల్లలు ముందడుగు వేసేలా తల్లిదండ్రులు కషి చేయాలన్నారు.జీవితంలో విద్య ఏకైకమార్గమని తెలిపారు.బాల్య వివాహాలు చేయకుండా ఆడపిల్లలను వారి అభీష్టం మేరకు చదివించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.నేరాలకు పాల్పడుతున్న మరియు 18 ఏండ్లలోపు బాలబాలికలకు ఏవైనా సమస్యలు ఉంటే 1098 లేదా100 కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు.బాలల హక్కుల పట్ల సమాజంలో స్పహ పెంపొందించడం అవసరమని, తద్వారా పిల్లల రక్షణ పునరావాసం కోసం సమాజం ముందుకు రావాలన్నారు.పౌరులుగా మనం ఒక దేశంగా మనం మన పిల్లలందరికీ న్యాయం చేయగలిగితే ప్రజాస్వామ్యానికి అదే అత్యుత్తమ పరీక్ష అని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ జ్యోతి, సూపర్వైజర్ షమీం, రాణి, ప్రభాకర్, అంగన్వాడీ టీచర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.