Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సబ్సిడీని లబ్దిదారులకు సత్వరమే అందించాలి
- అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో పరిశ్రమల శాఖ ద్వారా మంజూరైన వివిధ పథకాల ప్రభుత్వ సబ్సిడీని లబ్దిదారులకు అందించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అన్నారు.శనివారం కలెక్టరేట్నందు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డీఐపీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.పరిశ్రమ,వ్యాపారరంగాలలో పలు పథకాలపై ఔత్సాహికులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి సమావేశాలు నిర్వహించాలన్నారు.లబ్దిదారులందరికి కూడా సబ్సిడీ అందేలా చిదాలని అన్నారు. జిల్లాలో మంజూరైన వివిధ పథకాలకు సంబంధించి 23 మంది యస్.సి. లబ్దిదారులకు అలాగే యస్.టి లబ్దిదారులు 90 మందికి సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తద్వారా లబ్దిదారులకు లబ్ది చేకూరుతుందన్నారు.ప్రధానమంత్రి ఉపాది కల్పన పథకం కింద పరిశ్రమలకు ఖరీదు తయారీ రంగంలో రూ.25 లక్షల నుండి 50 లక్షల వరకు , అలాగే సర్వీస్ రంగంలో 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంచడం జరిగిందని దరఖాస్తులను ఔత్సాహికులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని, ఇతర వివరాలకు పరిశ్రమల కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.ట్రేడింగ్ రంగానికి సంబంధించి లైసెన్స్‌లను సకాలంలో అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో డీఎం పరిశ్రమలు తిరుపతయ్య, ఏఓ శ్రీదేవి, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.