Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాహుల్‌శర్మ
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీర్లను కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు.శనివారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు.చర్లపల్లిలో అర్బన్‌పార్కు పనులు పరిశీలించి ట్రీ ప్లాంటేషన్ చేసిన మొక్కలను పరిశీలించారు. పార్కు ఎంట్రెన్సు గేటు వద్ద జరుగుతున్న పనులను, డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను, ఏజెన్సీ నిర్వాహులను కోరారు.మర్రిగూడ బైపాస్ వద్ద జంక్షన్ పనులను పరిశీలించి మొక్కలను ఇంకా ఎక్కువ మొత్తంలో నాటాలని తెలిపారు.పాలిటెక్నిక్ కళాశాల ప్రక్కన కెనాల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసే సుందరీకరణ గురించి మున్సిపల్ కమీషనర్, ఏజెన్సీ వారితో కలెక్టర్ చర్చించారు. అదే విధంగా కెనాల్ కు మరో పక్క ఐ.టి. టవర్ ప్రాంతంలో హ్యండ్ సింబల్ తో కూడిన కట్టడంపై చర్చించారు. ఎన్.టి.ఆర్. విగ్రహం వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. బీట్ మార్కెట్లో ఏర్పాటు చేస్తున్న వెజ్, నాన్వెజ్మార్కెట్ పనులను పరిశీలించి మార్బుల్ పనులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు.వెల్వేషన్ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా ఇంజనీర్లు చొరవ తీసుకోవాలని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్త చేయడానికి రెండు షిప్టులలో పనులు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను కోరారు.అదేవిధంగా దేవరకొండ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి సంబంధిత ఇంజనీర్లతో చర్చించారు.డీఈఓ ఆఫీస్ వరకు పనులు పూర్తి చేసే విధంగా తగిన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.అనంతరం రామ్‌నగర్ పార్కు ఎంట్రెన్సు గేట్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు.పార్కులో పర్యటించి పూర్తి అయిన పనుల వివరాలు మున్సిపల్ కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డా. కె.వి రమణాచారి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీ నిర్వాహుకులు, తదితరులు పాల్గొన్నారు.