Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి రూరల్
నాల్గో విడత పట్టణ ప్రగతి, 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందిని కలెక్టర్ పమేలా సత్పతి అభినందిస్తూ వారిని సత్కరించారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పారిశుధ్య కార్మికుల పాత్ర ముఖ్యమైనదని , వారి సేవలు కొనియాడదగినవనానరు.సాయంత్రం వరకు పట్టణంలోని కానీ, పల్లెలో కానీ చెత్తాచెదారం వేసి వెళ్ళిపోతాం కానీ అది తెల్లారేసరికి పారిశుధ్య కార్మికులు శుభ్రం చేసి పట్టణాన్ని, గ్రామాన్ని అందంగా కనిపించే విధంంగా చేస్తారన్నారు.వారి సేవలకు ఎంత చెప్పినా తక్కువేనన్నారు.ు.జూన్ -3 నుండి 18 వరకు పట్టణ ప్రగతి, పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించు కున్నామన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో, గ్రామ పంచాయితీ పరిధిలో పాద యాత్రలు నిర్వహించి గ్రామ సభలు ఏర్పాటు చేసి పట్టణానికి, గ్రామానికి ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నా మన్నారు.మ్యాజిక్ ఇంకుడు గుంతలు కట్టుకోవడానికి ప్రజలను ప్రోత్సాహించడం, మురికి నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించామ మన్నారు.హరితహారం కార్యక్రమంలో గతంలో నాటిన మొక్కలు చనిపోయిన వాటిలో కొత్త మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.జిల్లాలోని అన్ని నర్సరీలలో కల్పు మొక్కలను తొలగించేందుకు, తాగు నీటి ఓవర్ హెడ్ ట్యాన్కులను , సంపులు శుభ్రం చేసేందుకు, ఖాళీగా ఉన్న ప్రాదేశాలలో మొక్కలు నాటేందుకు, గ్రామ పంచాయితీ పరిధిలో రోడ్లన్నింటిని క్రాస్ కంట్రీ ద్వారా పరిశీలించి వచ్చే హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ప్రదేశాలు గుర్తించినట్లు ఆమె తెలిపారు. బహత్ పల్లె ప్రకతి వనాలు, నర్సరీలను సంబంధిత అధికారులందరూ తనిఖీ చేయడం జరిగిందన్నారు. శుభ శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల సందర్శన, ప్రభుత్వ వైద్య శాలల సందర్శన ప్రతి రోజు సమయం చూసుకొని తమకు అందుబాటులో ఉన్న వాటిని అధికారులు సందర్శిస్తూ ఉండాలన్నారు.బుధవారం భోధన అనే కొత్త కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొదటిగా మన జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.దీనికి ఎటువంటి ఖర్చు లేదని ఇది పిల్లలకు బాగా ఉపయోగపడుతుందన్నారు. గ్రామాలు సందర్శించినప్పుడు భవిత కేంద్రాలను పరిశీలించి వారిని ప్రోత్సహించాలన్నారు.ప్రభుత్వ ప్రాధమిక వైద్యశాలలతో పాటు ఆయుష్ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు.జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రజలు సమస్యలు జిల్లా యంత్రాంగం దష్టికి వచ్చాయన్నారు. అవి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు.జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను సందర్శింఛిన్నట్లు, తమ దష్టికి వచ్చిన సమస్యలను మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించి పరిష్కరించామన్నారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం బాగుందన్నారు.జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రకతివనాలు, బహత్ పల్లె ప్రకతి వనాలలో, నర్సరీలలో సిబ్బంది పనులు బాగున్నాయన్నారు.పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాలలో పని చేసిన గ్రామ పంచాయితీ సిబ్బందికి, పంచాయతీ సెక్రెటరీలకు, జిల్లాలోని మున్సిపల్ సిబ్బందికి, ఎంపీఓలకు, ఎంపీడీఓలకు,ఎంఎస్ఓలకు, గెస్ట్ స్పెషల్ ఆఫీసర్, డీఆర్డీఏ పీడీ, డీపీఓ,జెడ్పీ సీఈఓలను శాలువా, ప్రశంసాపత్రాలతో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపీడీఓలు,ఎంపీఓలు,ఎంఎస్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.