Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మునగాల
సాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.శనివారం మునగాల ఎల్-33 కలకోవ ఎత్తిపోతల పథకాలను ఆయన పరిశీలించి మాట్లాడారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా లిఫ్టులను ప్రభుత్వమే నడిపిస్తుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు.ఖరీప్ సీజన్ మొదలైననందున యుద్ధ ప్రాతిపదికన అవసరమైన నిధులు కేటాయించి లిఫ్టులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.లిఫ్టులకు సంబంధించిన బావులు కాలువల్లో పూడికలు తీయించాలన్నారు.తూములసెట్టర్స్,కాల్వ కట్టలు, రహదారులు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని కోరారు.లిఫ్టుల నిర్వహణ బాధ్యతను ఐడీసీకి అప్పగించాలని సూచించారు.లిఫ్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు.ఎత్తిపోతలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ ఈనెల 27వ నల్లగొండలో నీటిపారుదల సీఈ కార్యాలయం ముందు జరిగే ధ ర్నాకు రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు,జిల్లా నాయకులు మేదరమెట్లవెంకటేశ్వరరావు, దేవరం వెంకట్రెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సత్యనారాయణ,గోపిరెడ్డి, మల్లారెడ్డి, దొంగరి అప్పారావు,మండవ వెంకన్న పాల్గొన్నారు.