Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
రైతులకు ఇవ్వాల్సిన దాన్యం డబ్బులు, పెట్టుబడి సాయం(రైతుబంధు)డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు.శనివారం మండలంలోని గుజ్జ గ్రామంలో నిర్వహించిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కుకుడాలరంగారెడ్డి 11వ, దేవిరెడ్డి 8వ వర్థంతి సభల్లో ఆయన మాట్లాడారు.అమరులు రంగారెడ్డి,దేవిరెడ్డి ఈ ప్రాంత రైతాంగం ఉద్యమంలో ముందుండి పోరాడినట్లు గుర్తుచేశారు.రైతాంగ, పేదల సమస్యలపై మరిన్ని పోరాటాలు నిర్వహించడం ద్వారా అమరుల ఆశయాలు నెరవేరు తాయన్నారు.కుకుడాల రంగారెడ్డి ప్రభుత్వంతో పోరాడి పేద రైతులకు ప్రభుత్వ భూములు పంపిణీ చేశారన్నారు.అమరుల త్యాగాలను పార్టీ ఎప్పటికీ మరవద్దు అన్నారు.రంగారెడ్డి,దేవి రెడ్డి ఆశయసాధనకు కార్యకర్తలు కషి చేయాలన్నారు.రైతుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా డబ్బులు ఖాతాలో జమ చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఈనెల గడుస్తున్నా ఇప్పటికీ రైతుబంధు డబ్బులు అందజేయడం విచారకరమన్నారు.ఏకకాలంలో రైతులకు లక్ష రుణ మాఫీ వర్తింప చేయాలన్నారు.నూతనంగా పంట రుణాలు ఇవ్వాలన్నారు.రైతులకు అవసరం ఉన్న ఎరువులు విత్తనాలను మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు.అంతకుముందు అమరవీరుల స్మారక భవనంపై జెండా ఎగురవేశారు.అమరుల చిత్రపటాలకు పూల మాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దొడ్డ యాదిరెడ్డి, ఎంపీటీసీ దొడ వినోద్‌రెడ్డి, ఉపసర్పంచ్ వెలిజాల గోపిక సుందరయ్య, శాఖ కార్యదర్శి చాడ నర్సింహ, సీనియర్ నాయకులు కొండవీటి మాధవరెడ్డి, వార్డు సభ్యులు బొమ్మగాని యాదమ్మ, నాయకులు బొమ్మగాని శంకరయ్య, పర్సనల్ బోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.