Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మోత్కూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీలో సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలను తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు, అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వడం లేదని, సొంతస్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని గత బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించినా అమలు చేయడం లేదని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29న తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా విజయ వంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యురాలు రాములమ్మ, నర్సింహ, లక్ష్మీ, కరుణాకర్, సాయి, నర్సింహ, శ్రీను పాల్గొన్నారు.