Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
మున్సిపాలిటీ పరిధిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వెనుక భాగంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ప్రాంతంలో సరైన డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడంతో సుమారు పది ఎకరాల భూమి పడావు గా ఉందని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. ఆదివారం ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పన్నాల గూడెం, బాబాన్ సాహెబ్ గూడెం, పద్మా నగర్, మార్కెట్ రోడ్డు, కనకదుర్గ దేవాలయం ప్రాంతం, డాక్టర్స్ కాలనీ తదితర ప్రాంతాల నుండి వచ్చే మురికి నీరు, వర్షపు నీరు ప్రవాహానికి సరైన డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడంతో సుమారు పది ఎకరాల భూమి సాగుకు పనికిరాకుండా పోతుందన్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి సరైనడ్రయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుందన్నారు. ఆయన వెంట ఆ ప్రాంత రైతులు ఉన్నారు.