Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సివిల్ కోర్టు జడ్జి సూర సుమలత
నవతెలంగాణ - ఆలేరుటౌన్
మరింత జఠిలంగా పరిష్కరించలేని చేతులకు రాజీమార్గమే రాజామార్గమని ఆలేరు సివిల్ కోర్టు జడ్జి సూర సుమలత అన్నారు. ఆదివారం పట్టణకేంద్రంలో నిర్వహించిన లోక్ అదాలత్లో ఆమె మాట్లాడారు. ప్రతి కేసు విషయంలో ఎలాంటి పంతాలకు పోకుండా ఉండాలన్నారు. పంతాలకు పోయినట్లయితే సమయం డబ్బు వృథా అవుతుందన్నారు. సివిల్ కోర్టు పరిధిలో లోక్అదాలత్ ద్వారా 1200 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుధగాని శ్రీహరి, ఉపాధ్యక్షుడు వనం రాజు ,సీఐ నవీన్ రెడ్డి , ఎస్సై ఎండీ ఇద్రిస్అలీ, వెంకట శ్రీనివాసులు ,అడ్వకేట్లు గుడ్ల స్వామి , జూకంటి రవీందర్ ,వి శివకుమార్, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.