Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే శరణ్య గ్రీన్ హోమ్ కాలనీ నుండి దారి ప్రతిపాదన తీసుకొస్తున్నారని శరణ్య గ్రీన్ హోం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నల్లమోతు రవీందర్, సింగిరి కొండ కిషోర్ ఆరోపించారు. ఆదివారం కాలనీ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ వెనుక భాగంలో ఉన్న వ్యవసాయ పొలంలోకి వెళ్లేందుకు కొందరు బినామీ రైతులు దారి ప్రతిపాదన తీసుకొచ్చారని విమర్శించారు. కాలనీ నిర్మించేటప్పుడు వ్యవసాయ రైతులు అభ్యంతరం తెలపలేదని, ఎప్పుడూ దారి కావాలని కోరలేదని, అధికారులు అన్ని పరిశీలించి కాలనీ నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చారని తెలిపారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు దారి కావాలంటూ కోరడం సరైనది కాదన్నారు .నిజమైన రైతులు లేరని ఆ వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు, స్వ లాభం పొందేందుకు బినామీ రైతుల పేరు చెప్పి తమ కాలనీ నుండి దారి అడుగుతున్నారని తెలిపారు. అన్ని అనుమతులు తీసుకొని, లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు నిర్మించుకున్న మని తెలిపారు. కాలనీ నుండి దారి ఇచ్చే ప్రసక్తే లేదని ఇది కాలనీవాసులు తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సొసైటీ నాయకులు భరతయ, భూపతి రెడ్డి, జూకంటి సత్యం,, బలరామకష్ణ, వెంకట్ రెడ్డి, గుంటి సత్యపాల్, శ్రీధర పురుషోత్తం, నగేష్, జాస్తి జయశంకర్, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.