Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీరాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
డ్రగ్స్ నివారణలో యువత ప్రధాన పాత్ర పోషించాలని, గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రం, దేశం అభ్యున్నతికి యువశక్తి ప్రదానం అని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాదకద్రవ్యాల అంతర్జాతీయ వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక డబుల్ బెడ్ రూం నివాసాల ప్రాంగణంలో ఎస్సౖౖె, కానిస్టేబుల్ ఉచిత శిక్షణలో ఉన్న యువతతో ఎస్పీ డ్రగ్స్ నివారణ, యువత బాధ్యత పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ ను ఈరోజుల్లో అనేక విధాలుగా దుర్వినియోగం చేస్తున్నారని, మత్తుకు అలవాటుపడి ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో డ్రగ్స్ అనేది పెద్ద పట్టణాల్లో మాత్రమే వినిపించేదని, ప్రస్తుత రోజుల్లో ఈ డ్రగ్స్, గంజాయి, కొకైన్ లాంటి అనేక రకాల డ్రగ్స్ అక్రమ మార్గంలో యువతకు, వ్యసనపరులకు అందుబాటులోకి వచ్చి ప్రతి గల్లిల్లో లభిస్తున్నాయన్నారు. ఈ పరిస్తితి ఇలాగే ఉంటే సమాజంలో నేరాలు పెరిగి సామాజికంగా అభద్రత ఏర్పడుతుందన్నారు. మత్తులో ఎలాంటి నేరాలు చేయడానికైనా దిగజారుతారని తెలిపారు.ఇలాంటి డ్రగ్స్ ను రూపుమాపే దిశగా యువతలో, పౌరుల్లో సామాజిక బాధ్యత పెరగాలని కోరారు. శిక్షణలో ఉన్న అభ్యర్థులు పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి డ్రగ్స్ నివారణకు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డి.యస్పీ నాగభూషణం, రూరల్ సిఐ విఠల్ రెడ్డి, పట్టణ సీఐఆంజనేయులు,యస్.బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శిక్షణ ఇన్చార్జి సీఐ ప్రవీణ్ కుమార్,ఆర్ఐ లు గోవిందరావు, నర్సింహారావు,ఆర్యస్ఐ సాయి, సిబ్బంది, పాల్గొన్నారు.