Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నకిరేకల్
నకిరేకల్ పట్టణంలో రూ. 2 కోట్ల తో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మార్కెట్ నిర్మాణానికి ఆదివారం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ పట్టణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో అభివద్ధి చేస్తున్నట్లు తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉండి ఉపయోగపడే విధంగా మహిళలకు ఇబ్బందులు లేకుండా కూరగాయలు మాంసం తదితరాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చే ఉద్దేశంతోనే సమీకృత మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుండి నిరంతరం నియోజకవర్గ అభివద్ధి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. అభివద్ధి చూసి ఓర్వలేని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పగడపు నవీన్ రావు, వై. సైదిరెడ్డి పాల్గొన్నారు.