Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కషి
- దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
నవతెలంగాణ-చందపేట
గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని దేవరకొండ శాసన సభ్యులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శనివారం చందంపేట మండలం గన్నేర్లపల్లి గ్రామంలో రూ.5లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను,పల్లె ప్రకతి వనాని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... గత పాలకుల నిర్లక్ష్యంతో అనేక గ్రామాలు నాగరికతకు దూరంగా ఉన్నాయని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల సర్వతోముఖాభివద్ధికి కషి చేస్తూ గ్రామాలను చైతన్యం చేసిందన్నారు. నేడు గ్రామాల్లో విద్య వైద్యం మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సౌకర్యం విద్యుత్ సదుపాయం రవాణా సౌకర్యాలు కల్పిస్తూ గ్రామాలను పట్టణాలు గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ సిరందాసు లక్ష్మమ్మకష్ణయ్య, జెడ్పీటీసీ రమావత్ పవిత్ర,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొందేటి మల్లా రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, రైతు బంధు అధ్యక్షులు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,శిరందాసు కష్ణయ్య, రమావత్ మోహన్ కష్ణ, స్థానిక సర్పంచ్ కొండ్రపల్లి నాగార్జున్, మర్ల శ్రీశేలం, రామకృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, ఎంపీడీఓ రాములు నాయక్, పాల్గొన్నారు.