Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.రాములు
నవతెలంగాణ-సూర్యాపేట
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు సిరికొండ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ,రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎటీఎఫ్ఐ పిలుపు మేరకు టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 27,28,29 తేదీల్లో మండల కేంద్రాల్లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.జూలై 1న జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఖాళీ పోస్టులను నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. విద్యా రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని, పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలని కోరారు. మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా గౌరవ వేతనాన్ని రూ.3000 పెంచే ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సోమయ్య ,జిల్లా ఉపాధ్యక్షులు కె .అరుణ భారతి,జిల్లా కోశాధికారి జి. వెంకటయ్య ,జిల్లా కార్యదర్శులు జె.యాకయ్య ,సిహెచ్ వీరారెడ్డి ,ఎన్ నాగేశ్వరరావు , యస్.సోమయ్య,జె కమల, వి.రమేష్, బి.ఆడమ్, రమేష్, డి.లాలు , జె క్రాంతి ప్రభ , డి శ్రీనివాస చారి, బి పిచ్చయ్య, లక్ష్మి నారాయణ ,ఆనంద్, చారి యాదయ్య, నాగేశ్వరరావు, నాగు,ఉపేందర్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలు ర్యాలీలు నిరసన ప్రదర్శన నిర్వహించాలి
కోదాడరూరల్ : విద్యారంగ సమస్యలపై మండల కేంద్రాల్లో ఈ నెల 27,28,29 తేదీల్లో ఉపాధ్యాయులు ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. విద్యారంగ సమస్యలు ఎఎన్సీఎస్, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని,పాఠశాలల్లో ఖాళీ పోస్టులను బదిలీలు, పదోన్నతులు, నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.